![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -845 లో.... ఏంజిల్ మనసులో ఎవరు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు విశ్వనాథ్. అయితే ఏంజిల్ చెప్పకుండా టైం వచ్చినప్పుడు చెప్తానని విశ్వనాథ్ కి చెప్పి వెళ్తుంది.
ఆ తర్వాత రిషి దగ్గరికి ఏంజిల్ వచ్చి మాట్లాడుతుంది. రిషి మనసులో ఏంజిల్ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని అనుకుంటుంది. రిషి.. ప్రేమ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని ఏంజిల్ అడుగుతుంది. రిషి కాస్త ఏంజిల్ వైపు కోపంగా చూసినా.. తర్వాత వసుధార ని ఉహించుకొని తన మొదట పరిచయం నుండి వసుధారపై ప్రేమ పై పొందిన అనుభూతిని రిషి చెప్తుంటే ఏంజిల్ కి రిషిపై ప్రేమ మరింత పెరుగుతుంది. ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్తున్నావ్? ఎవరైనా ప్రేమించావా అని ఏంజిల్ అడుగుతుంది. నువ్వు ఇంకొకసారి నా గురించి అలా అడగకని రిషి అంటాడు. ఆ తర్వాత నా గురించి అడగడం మానేసి విశ్వనాథ్ గారు నిన్ను పెళ్లి గురించి ఆలోచించమన్నాడు. అది ఆలోచించు ఆ విషయంలో నీకు ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను. ఎవరైనా సరే.. వాళ్ళతో నేను మాట్లాడుతానని తనకి ఏంజిల్ పై ఫీలింగ్ లేదనే విషయం క్లారిటీగా చెప్తాడు. కానీ ఆ విషయం ఏంజిల్ కి మాత్రం అర్థం కాదు.
మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజిల్ వస్తుంది. ఎలాగైనా ఏంజిల్ రిషిపై తన ప్రేమని చెప్పి తన మనసులో ఏం ఉందో కనుక్కోమని చెప్పాలని ఏంజెల్ అనుకుంటుంది. వసుధారకి తనలో మొదలైన ప్రేమ గురించి చెప్తుంది. పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుండి నా మనసు ఎందుకో నిలకడగా ఉండట్లేదని ఏంజిల్ మాటల్లో తను ప్రేమలో పడిందని వసుధార అనుకొని.. నీ మనసులో ఎవరు ఉన్నారని ఏంజిల్ ని వసుధార అడుగుతుంది. ఏంజెల్ సిగ్గుపడుతు.. నీకు బాగా తెలిసిన వ్యక్తి అంటూ.. మీ రిషి సర్ అని ఏంజిల్ చెప్పగానే వసుధార గుండె ముక్కలవుతుంది. కళ్ళలో నీళ్లు బయటకు రాకుండా బాధపడుతుంది. రిషి మనసులో ఏముందో కనుక్కో.. ఈ ఒక్క హెల్ప్ చెయ్ అని వసుధారని ఏంజిల్ రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఏంజిల్ చెప్పిన మాటలన్నీ వసుధార గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |